ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం : చత్తీస్‌గఢ్ ఏజెన్సీలో పోలీస్ ఇన్ఫార్మర్లన్న నెపంతో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్తులని హమార్చిన సంఘటన బుధవారం రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో వెలుగు చూసింది. రాజ్‌నంద్‌గావ్ పోలీస్ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజ్‌నంద్‌గావ్ జిల్లా కామ్ఖేడా గ్రామంలోకి ఈ నెల 25వ తేదీన రాత్రి సాయుధంగా చొరబడిన మావోయిస్టులు అక్కడి సర్పంచ్ మామ అయిన ఇందర్సాయ్ మాండవి(40)ని ఇంట్లో నుంచి లాక్కువెళ్లారు.
అక్కడి సమీప ప్రాంతంలోకి మాండవిని తీసుకెళ్లిన మావోయిస్టులు అతని కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న మురర్పాని గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్తుడు ఘవ్డేని సైతం మావోయిస్టులు హతమార్చి వెళ్లిపోయారు. సంఘటనా స్థలంలో మాండవి, ఘవ్డేలు పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారన్న సమాచారంతోనే వారిని హతమార్చినట్లు మావోయిస్టులు విడిచిన లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతాన్ని అప్రమత్తం చేసి మావోయిస్టుల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కస్టమ్స్ సేవలు ప్రశంసనీయం : గవర్నర్ తమిళిసై
సమస్యల పరిష్కారానికే ‘ప్రజా వేదిక’
13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు
అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్ పోచారం
తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
తాజావార్తలు
- కరోనాతో ఖండ్వ ఎంపీ మృతి
- మీడియాపై కస్సుబుస్సుమంటున్న సురేఖ వాణి కూతురు
- రాజ్యసభ, లోక్‌సభ టీవీలు.. ఇక నుంచి సన్సద్ టీవీ
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు