ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 30, 2020 , 17:21:36

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

వరంగల్‌ : మావోయిస్టు దంపతులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు దంపతులు యాలం నరేందర్‌ అలియాస్‌ సంపత్‌(32), పోడియం దేవి.. వరంగల్‌ సీపీ ప్రమోద్‌ ఎదుట లొంగిపోయారు. నరేందర్‌ వాజేడు, వెంకటాపురం మావోయిస్టు పార్టీ కమిటీ సభ్యుడి కాగా దేవి మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్‌ విభాగంలో దళ సభ్యురాలు. వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పించనున్నట్లు సీపీ వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో నిన్న ఎనిమిది నక్సల్స్‌ లొంగిపోయిన విష‌యం తెలిసిందే. వీరిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. పోలీసులు చేపట్టిన ఇంటికి/గ్రామానికి తిరిగిరండి కార్యక్రమంలో భాగంగా ఇటీవల పదుల సంఖ్యలో నక్సల్స్‌ ఆయుధాలు వీడి లొంగిపోతున్నారు. logo