రాష్ట్రంలో విధ్వంసానికి మావోయిస్టుల కుట్ర : ములుగు ఎస్పీ

ములుగు : రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు యాక్షన్ టీంలను, దళాలను మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న తెలంగాణ సరిహద్దులకు పంపినట్లు తమకు విశ్వసనీయమైన సమాచారం ఉందని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసేందుకు వ్యూహ రచన చేసినట్లు సమాచారం అందిందని చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట అటవీ ప్రాంతాల్లో జిల్లా ప్రత్యేక బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముసలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. పోలీస్ బలగాలు తాడ్వాయి, పసర, మంగపేట తదితర ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. మావోయిస్టులు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉంటారని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వ్యవసాయ మంత్రిని అడ్డుకుని నిలదీసిన రైతులు
- వ్యవసాయ చట్టాలపై పదో విడత చర్చలు ప్రారంభం
- షూటింగ్ వల్లే ఆలియా భట్ అలసిపోయిందా ?
- గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్ రెడీ
- హర్భజన్‌ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- కోల్డ్ స్టోరేజ్‌లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
- ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
- రిషబ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్..
- మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!