శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 21, 2020 , 17:23:23

ప‌ట్ట‌ప‌గ‌లు తుపాకీతో బెదిరించి మ‌హిళ మెడ‌లో గొలుసు చోరి

ప‌ట్ట‌ప‌గ‌లు తుపాకీతో బెదిరించి మ‌హిళ మెడ‌లో గొలుసు చోరి

న్యూఢిల్లీ: ఢిల్లీలో దొంగ‌లు బ‌రితెగిస్తున్నారు. ప‌ట్ట‌ప‌గ‌లు అంతా చూస్తుండ‌గానే మార‌ణాయుధాల‌తో బెదిరిస్తూ దోపిడీల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఈస్ట్ ఢిల్లీలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఓ మ‌హిళ స‌మీప ఫంక్ష‌న్ హాల్లో వివాహానికి హాజ‌రై ఇంటికి తిరిగి వెళ్తుండగా గ‌మ‌నించిన ఇద్ద‌రు దొంగ‌లు బైకుపై ఆమెను అనుస‌రించారు. ఒక‌డు బైకుపైనే కూర్చుని ఉండ‌గా మ‌రొక‌డు మ‌హిళ వెనుకే వెళ్లి తుపాకీ చూపించి.. ఆమె మెడ‌లోని బంగారు గొలుసును లాక్కున్నాడు.

అనంత‌రం ఒక చేతిలో తూపాకీ, మ‌రో చేతిలో హెల్మెట్, చోరీ చేసిన బంగారు చైన్ ప‌ట్టుకుని పారిపోయాడు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల స‌మ‌యంలో ఈ చోరీ జ‌రిగింది. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఆ గ‌ల్లీలో జ‌నం ఉన్నా.. దొంగ చేతిలో తుపాకీ ఉండ‌టంతో చూస్తుండిపోయారే త‌ప్ప ఏమీ చేయ‌లేక‌పోయారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. వాటిని పోలీసులు మీడియాకు విడుదల చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo