సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 06:47:53

ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన దుండగులు.. పోలీసుల ఎదుటే ఘాతుకం

ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన దుండగులు.. పోలీసుల ఎదుటే ఘాతుకం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడిని తుపాకీతో కాల్చి చంపిన దుండగుడిని స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటన సోమవారం రాంపూర్‌ బాంగ్రా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చాడు. దీంతో ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మరణించారు. దుండగుడు వెంటనే ఇంటిపైకి ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడికి చేరుకొని దుండగుడిని చుట్టిముట్టారు. ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినా గ్రామస్థులు పట్టించుకోలేదు. కట్టెలతో నిందితుడిపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే నిందితుడు ఉపాధ్యాయుడిని ఎందుకు కాల్చిచంపాడన్న విషయం ఇంకా తెలియరాలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo