అహ్మదాబాద్ : వ్యవసాయ కూలీగా పనిచేసే ఓ వ్యక్తి ప్రియుడితో తన భార్య కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా హింసించాడు. గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య, ప్రియుడిని స్తంభానికి కట్టేసి వారిని నిందితుడు గాయపరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్యపై అనుమానం పెంచుకున్న నిందితుడు తరచూ ఆమెతో ఘర్షణ పడేవాడు.
తన వివాహేతర బంధాన్ని నిరూపించాలని భార్య రెట్టించడంతో నిందితుడు అవకాశం కోసం ఎదురుచూశాడు. తన భార్య ఆదివారం ప్రియుడితో కలిసి కంటపడటంతో వారిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. స్థానికుల జోక్యంతో బాధితులను విడిచిపెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిందితుడి భార్య, ప్రియుడు ముందుకు రాలేదు. వైరల్ వీడియో ద్వారా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా నిందితుడిని అదుపులోకి తీసుకుని అనంతరం బెయిల్ పై విడుదల చేశారు.