ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 14, 2020 , 14:15:01

అప్పు ఇవ్వ‌లేద‌ని ప్రియురాలిపై శానిటైజ‌ర్ పోసి నిప్పంటించాడు

అప్పు ఇవ్వ‌లేద‌ని ప్రియురాలిపై శానిటైజ‌ర్ పోసి నిప్పంటించాడు

చండీఘ‌ర్ : త‌న ప్రియురాలు అప్పు ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో ఆమె ముఖంపై శానిటైజ‌ర్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న చండీఘ‌ర్ లో జులై 7న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. షిల్లాంగ్ కు చెందిన 22 ఏళ్ల యువ‌తి 2019, డిసెంబ‌ర్ నుంచి చండీఘ‌ర్ లో ఉంటుంది. ఈ క్ర‌మంలో స్థానికంగా నివాస‌ముంటున్న న‌రేశ్ తో ఆ యువ‌తికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. దీంతో ఇద్ద‌రు క‌లిసి ఉంటున్నారు.

అయితే జులై 7న ఆమెను రూ. 2 వేలు అప్పు ఇవ్వ‌మ‌ని న‌రేశ్ అడిగాడు. డ‌బ్బులు ఇచ్చేందుకు యువ‌తి అంగీక‌రించ‌లేదు. ఆవేశానికి లోనైన న‌రేశ్.. ఆమె ముఖంపై శానిటైజ‌ర్ పోసి లైట‌ర్ తో నిప్పంటించాడు. 20 శాతం కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్న ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. యువ‌కుడు ప‌రారీలో ఉన్నాడు.

కాలిన గాయాల నుంచి కోలుకున్న యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు న‌రేశ్ ను శ‌నివారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


logo