మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 12, 2020 , 22:10:19

డబ్బు కోసం యువతిపై శానిటైజర్ పోసిన నిప్పెట్టిన ఘనుడు

డబ్బు కోసం యువతిపై శానిటైజర్ పోసిన నిప్పెట్టిన ఘనుడు

చండీగఢ్: తాను అడిగిన డబ్బును ఇచ్చేందుకు నిరాకరించిన యువతిపై ఓ యువకుడు శానిటైజర్ పోసి నిప్పుపెట్టిన సంఘటన చండీగఢ్ లో జరిగింది. ప్రాణాలతో బయటపడిన ఆ యువతి.. 20 శాతం కాలిన గాయాలతో స్థానిక దవాఖానలో చికిత్స పొందుతున్నది.

షిల్లాంగ్ కు చెందిన 22 ఏళ్ల మహిళను తనకు చాలా రోజులుగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి వచ్చి అప్పుగా కొంత డబ్బు అడిగాడు. అయితే, తన వద్ద అంత డబ్బు లేదని, రెండు రోజుల తర్వాత చూస్తానని చెప్పినా ఆ యువకుడు వినిపించుకోలేదు. తనకు రెండు వేలు ఇప్పుడే కావాలంటూ సదరు యువతితో వాగ్వాదానికి దిగి జేబులో ఉన్న శానిటైజర్ ను ఆమె ముఖంపై చల్లి లైటర్ వెలిగించాడు. దాంతో ఆమె ముఖంపై మంటలు లేచాయి. ఫలితంగా ఆమె ముఖంపై 20 శాతం గాయాలయ్యాయి. పొరుగింటి వారు గమనించి సదరు యువతిని స్థానిక దవాఖానకు తరలించారు. ఈ సంఘటన జూలై 6, 7 తేదీల మధ్య జరిగింది. నిందితుడిని నరేష్ గా గుర్తించారు. 

2019 డిసెంబర్‌లో చండీగఢ్ కు మకాం మార్చిన సదరు యువతి.. చాలా రోజులుగా నరేష్‌తో సహజీవనం చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన తర్వాత నరేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

తాజావార్తలు


logo