ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 11:27:21

దొంగతనానికి వచ్చి చావుదెబ్బలు తిన్నాడు..

దొంగతనానికి వచ్చి చావుదెబ్బలు తిన్నాడు..

ఇండోర్ ‌: ఆభరణాలు కొనేందుకు వచ్చినట్లు నటించి జ్యువెలరీ షాపు యజమాని కంట్లో కారం కొట్టి ఆభరణాలు చోరీ చేసేందుకు యత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో సారాఫా ప్రాంతంలో లవీన్ సోని అనే వ్యాపారి  జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆభరణాలు కొనేందుకు దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి సోని కంట్లో కారం కొట్టి 50 గ్రాముల బంగారు ఆభరణాలతో పారిపోయేందుకు ప్రయత్నించాడు.

స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మొత్తం షాపులోని సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది. పోలీసుల విచారణలో నిందితుడు మధ్యప్రదేశ్ దేవాస్ ప్రాంతానికి చెందిన ఆనంద్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామని, షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అమృత సింగ్ సోలంకి చెప్పారు.
logo