చోటు లేదన్నందుకు ఈ-రిక్షా డ్రైవర్ దాడి.. ప్రయాణికుడు మృతి

లక్నో: ఉత్తప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. చిన్న విషయానికే ఓ ఈ రిక్షా డ్రైవర్ ప్రయాణికుడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫూల్‌బాగ్ ఏరియాలో సోయబ్ అక్తర్ (22) అనే యువకుడు ఈ-రిక్షాలో తన ఇంటి వెళ్లడం కోసం అడ్డాపైకి వెళ్లాడు. అక్కడ ఈ రిక్షా డ్రైవర్ మోతాదుకు మించి ప్రయాణికులను ఎక్కిస్తుండటంతో సోయబ్ అభ్యంతరం వ్యక్తంచేశాడు.
దాంతో ఈ రిక్షా డ్రైవర్‌కు, సోయబ్‌కు మధ్య గొడవ జరిగింది. ఇంతలో డ్రైవర్‌కు తోడుగా మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి సోయబ్తో వాదనకు దిగారు. గొడవ మరింత పెద్దది కావడంతో ముగ్గురు కలిసి సోయబ్పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సోయబ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.