వీఐపీలా ఫోజిచ్చి రూ 1.43 లక్షలకు టోకరా

బెంగళూర్ : గోవాకు చెందిన ఓ వ్యక్తి బాడీగార్డులతో కలిసివచ్చి వీఐపీలా ఫోజిచ్చి హోటల్ బిల్లు ఎగవేసి ఉడాయించిన ఘటన బెంగళూర్‌లో వెలుగుచూసింది. స్వప్నిల్ నాయక్‌గా గుర్తించిన నిందితుడు తాను బసచేసిన హోటల్‌కు చెల్లించాల్సిన రూ 1.4 లక్షల బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు. నాయక్ తన బాడీగార్డులను కూడా మోసగించినట్టు వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాయక్ ఈనెల 2న గాంధీనగర్‌లోని జియోన్ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు.
ఆరు రోజుల తర్వాత జనవరి 8న నాయక్ భార్య సైతం హోటల్‌కు రాగా బాడీగార్డుల కోసం మరో రెండు రూములు తీసుకున్నారు. మరుసటి రోజు వారు ఓ మినీబస్‌ను మాట్లాడుకుని రామనగర టూర్‌కు వెళ్లారు. ఆపై హోటల్ బిల్లు చెల్లించకుండా భార్యాభర్తలు పరారయ్యారు. మినీబస్ కంపెనీకి, తన బాడీగార్డులకూ డబ్బు చెల్లించకుండా నిందితుడు మోసగించినట్టు తెలిసింది. భోజనం, లాడ్జింగ్ కోసం నిందితుడు తమకు రూ. 1,43,243 చెల్లించాలని హోటల్ నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్‌ను మోసగించిన నాయక్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- పాల సేకరణ ధరలు పెంచిన కరీంనగర్ డెయిరీ
- దత్తత కుమారుడి పెండ్లికి హాజరైన రాజ్‌నాథ్ సింగ్
- శ్రీవారి ఆలయంలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ
- బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు: కేటీఆర్
- ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021 అవార్డు అందుకున్న హైదరాబాదీ
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ ఫైట్: దిగ్గజాల మధ్య సవాళ్లు.. ఎవరెవరు ఎటువైపు?
- షుగర్ కంట్రోల్‌కు మెరుగైన ఆహారాలు..!
- పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్
- ముగిసిన మేడారం మినీ జాతర