సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 12, 2020 , 16:46:52

భార్య‌ను చంపి.. మామ జననాంగాలు కోసేశాడు..

భార్య‌ను చంపి.. మామ జననాంగాలు కోసేశాడు..

కోల్ క‌తా :  ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను హ‌త్య చేసి, మామ జ‌న‌నాంగాలు కోసేశాడు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ సోనాపూర్ లోని సుభాష్ గ్రామ్ ఏరియాలో శ‌నివారం చోటు చేసుకుంది. 

బ‌సుదేవ్ గంగూలీ(76)కి సుమిత పండిట్ అనే కూతురు ఉంది. గంగూలీ సుమిత‌కు పెంపుడు తండ్రి. అయితే సుమిత‌ను ర‌మేశ్ అనే వ్య‌క్తికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే గ‌త కొంత‌కాలం నుంచి ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్నాడు ర‌మేశ్. ఈ క్ర‌మంలో ర‌మేశ్, సుమిత మ‌ధ్య శుక్ర‌వారం రాత్రి తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో తీవ్ర ఆగ్ర‌హానికి లోనైన ర‌మేశ్.. సుమిత‌, బ‌సుదేవ్ పై క‌త్తితో దాడి చేశాడు. సుమిత ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిపోయింది. బ‌సుదేవ్ జ‌న‌నాంగాల‌ను ర‌మేశ్ కోసేసి ప‌రారీ అయ్యాడు.

అయితే ఆదివారం బ‌సుదేవ్ నివాసంలో ఉన్న పూల‌ను కోసేందుకు పొరుగింటి వారు రావ‌డంతో మృత‌దేహాలు క‌న‌బ‌డ్డాయి. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న తండ్రికుమార్తెల మృత‌దేహాల‌ను చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


logo