ఆదివారం 09 ఆగస్టు 2020
Crime - Jul 06, 2020 , 11:31:00

ప్ర‌యివేటు భాగాల‌పై శానిటైజ్ చేసి వేధించారు

ప్ర‌యివేటు భాగాల‌పై శానిటైజ్ చేసి వేధించారు

పుణె : ఓ కంపెనీ య‌జ‌మాని త‌న ఉద్యోగి ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు. కంపెనీ డ‌బ్బును సొంత ఖ‌ర్చుల‌కు వాడుకున్నందుకు.. అత‌న్ని కిడ్నాప్ చేసి నిర్బంధించారు. అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌యివేటు భాగాల‌పై శానిటైజ్ చేసి వేధింపుల‌కు గురి చేశారు. ఈ ఘ‌ట‌న పుణెలో చోటు చేసుకుంది. 

పెయింటింగ్స్ ఎగ్జిబిష‌న్ కంపెనీలో ప‌ని చేస్తున్న మేనేజ‌ర్(30).. కంపెనీ ప‌నిమీద ఈ ఏడాది మార్చి నెల‌లో ఢిల్లీ వెళ్లాడు. ఆ స‌మ‌యంలో లాక్ డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో.. స‌ద‌రు మేనేజ‌ర్ ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. లాక్ డౌన్ స‌డ‌లింపుల త‌ర్వాత‌.. మే 7వ తేదీన పుణెలోని సొంతూరు కొత్రూడ్ కు తిరిగొచ్చాడు.  

అయితే కంపెనీ ఇచ్చిన డ‌బ్బుతోనే ఢిల్లీలో మేనేజ‌ర్ గ‌డిపాడు. పుణెకు రాగానే ఆయ‌న‌ను 17 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని కంపెనీ య‌జ‌మాని చెప్పాడు. క్వారంటైన్ పూర్తి చేసుకుని కంపెనీకి తిరిగొచ్చిన అత‌నిపై.. య‌జ‌మాని దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు. ఢిల్లీలో ఖ‌ర్చు పెట్టిన కంపెనీ డ‌బ్బును తిరిగి ఇవ్వాల‌ని య‌జ‌మాని డిమాండ్ చేశారు. కంపెనీ ప‌ని మీద వెళ్లిన తాను.. న‌గ‌దు ఎలా తిరిగి ఇవ్వాల‌ని ప్ర‌శ్నించాడు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య స్వ‌ల్ప వివాదం చోటు చేసుకుంది. 

దీంతో జూన్ 13న మేనేజ‌ర్ ను య‌జ‌మానితో పాటు మ‌రో ఇద్ద‌రు కిడ్నాప్ చేసి ఓ గ‌దిలో నిర్భందించారు. రెండు రోజుల పాటు అక్క‌డే ఉంచి.. ప్ర‌యివేటు భాగాల‌పై శానిటైజ‌ర్ పూశారు. వేధింపుల‌కు గురి చేశారు. 

త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానంపై పౌడ్ పోలీసుల‌కు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితుడు ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.


logo