శనివారం 16 జనవరి 2021
Crime - Dec 05, 2020 , 15:05:29

తుపాకీతో కాల్చుకుని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

తుపాకీతో కాల్చుకుని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

లక్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముజ‌ఫ‌ర్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని న‌గ్లా ముబార‌క్‌పూర్ గ్రామంలో ర‌వి (25) అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో తుపాకీతో త‌న‌ను తాను కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. శుక్ర‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు తాము ముబార‌క్‌పూర్‌కు చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించామ‌ని చెప్పారు. ఘ‌ట‌నా ప్రాంతంలో ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే, యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌కుగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌న్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.