శనివారం 08 ఆగస్టు 2020
Crime - Jul 13, 2020 , 11:13:08

న‌వ వ‌ధువును చంపేసి ఆత్మ‌హ‌త్య‌

న‌వ వ‌ధువును చంపేసి ఆత్మ‌హ‌త్య‌

గురుగ్రామ్ : హ‌ర్యానాలోని గురుగ్రామ్ ప‌ట్ట‌ణంలో దారుణం జ‌రిగింది. ఓ న‌వ వ‌ధువును చంపేసి త‌న‌కు తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నాన్ కౌన్ గ్రామానికి చెందిన రాజేశ్(30)కు ప్రియాంక(20)‌తో గ‌త కొంత‌కాలం నుంచి సంబంధం ఉంది. రాజేశ్ కు కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, ముగ్గురు పిల్ల‌లు. ప్రియాంక‌కు జూన్ 29న మ‌రో వ్య‌క్తికి పెళ్లి అయింది. శ‌నివారం రోజు ప్రియాంక త‌న ఇంటికి వ‌చ్చింది.

విష‌యం తెలుసుకున్న రాజేశ్.. ఆమె నివాసానికి వెళ్లాడు. ఆ త‌ర్వాత ఆమెను త‌న దాబా వ‌ద్ద‌కు తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపాడు. అనంత‌రం అత‌ను కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సాయంత్రం వ‌ర‌కు ప్రియాంక తిరిగి రాక‌పోవ‌డంతో.. ఆమె కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉద‌యం 5 గంట‌ల స‌మ‌యంలో రాజేశ్ దాబా వ‌ద్ద రెండు మృత‌దేహాలు ప‌క్క‌ప‌క్క‌నే ప‌డి ఉన్నాయి. పిస్తోల్ కూడా ఉంది. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo