బుధవారం 20 జనవరి 2021
Crime - Oct 18, 2020 , 17:02:56

క‌ట్నం కోసం కాల్చి చంపాడు!

క‌ట్నం కోసం కాల్చి చంపాడు!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దారుణం జ‌రిగింది. క‌ట్నం కోసం ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను కాల్చి చంపాడు. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాలోని ఖ‌టౌలి ప‌ట్ట‌ణంలో ఈ దారుణం జరిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఖ‌ష్‌నుమా (35), ఫిరోజ్ ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. ప‌దేండ్ల క్రితం వారి వివాహం జ‌రుగింది. వారి ఇద్ద‌రు పిల్లలున్నారు. గ‌త కొన్నేండ్లుగా వీరి కుటుంబం ఖ‌టౌలి ప‌ట్ట‌ణంలో నివాసం ఉంటోంది. అయితే పెండ్లి జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఆరిఫ్ ఖుష్‌నుమాను క‌ట్నం కోసం వేధించేవాడు. రోజులు గ‌డుస్తున్నా కొద్ది అత‌ని వేధింపులు పెరిగిపోయాయి. 

ఈ క్ర‌మంలోనే ఇవాళ (ఆదివారం) కూడా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య క‌ట్నం గురించి గొడ‌వ జ‌రిగింది. అయితే మాటామాటా పెరిగి గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో ఆరిఫ్ తుపాకీతో ఖుష్‌నుమాపై కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఖుష్‌నుమా అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకునే స‌రికే ఆరిఫ్ అక్క‌డి నుంచి పారిపోయాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఖుష్‌నుమా మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. ప‌రారీలో ఉన్న ఆరిఫ్ కోసం గాలిస్తున్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo