శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 20, 2020 , 17:51:49

కొడుకును చంపి త‌ల్లి మెడ‌లో బంగారం ఎత్తుకెళ్లిన దొంగ‌

కొడుకును చంపి త‌ల్లి మెడ‌లో బంగారం ఎత్తుకెళ్లిన దొంగ‌

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరులో దారుణం జ‌రిగింది. ఓ వ్య‌క్తి మ‌హిళ మెడ‌లో గొలుసు చోరీ చేసి, ఆమె కొడుకును గొంతు పిసికి చంపేశాడు. అనంతరం అక్క‌డి నుంచి పారిపోయాడు. బెంగ‌ళూరులోని జ్ఞాన‌గంగాన‌గ‌ర్ ఏరియాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌ళ్లారి జిల్లాకు చెందిన హ‌నుమంత‌మ్మ త‌న భ‌ర్త 12 ఏండ్ల కొడుకుతో క‌లిసి బెంగ‌ళూరులోని జ్ఞాన‌గంగాన‌గ‌ర్ ఏరియాలో నివాసం ఉంటున్న‌ది. వారి గ్రామానికే చెందిన గాజ‌లింగ‌ప్ప కూడా అదే ఏరియాలో ఉంటున్నాడు. హ‌నుమంత‌మ్మ కుటుంబానికి, గాజ‌లింగ‌ప్ప‌కు గ‌త 15 ఏండ్లుగా ప‌రిచ‌యం ఉన్న‌ది. 

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి హ‌నుమంత‌మ్మ భ‌ర్త ప‌నిమీద బ‌య‌టకు వెళ్ల‌గా.. రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో గాజ‌లింగ‌ప్ప వారి ఇంట్లో చొర‌బ‌డ్డాడు. ఆమె మీదున్న మూడున్న‌ర తులాల బంగారం మీద క‌న్నేసిన గాజలింగ‌ప్ప ముందుగా రాయితో ఆమె త‌ల‌పై కొట్టాడు. త‌ల్లి కేక‌లు విని అప్ప‌టికే నిద్రపోయిన ఆమె 12 ఏండ్ల కొడుకు లేచి గాజ‌లింగ‌ప్ప‌ను అడ్డ‌గించాడు. దాంతో గాజ‌లింగ‌ప్ప ఆ బాలుడి గొం‌తు నులిమి చంపేశాడు. అనంతరం హ‌నుమంత‌మ్మ మెడ‌లో గొలుసును లాక్కుని పారిపోయాడు. 

త‌ల్లీ కొడుకు అరుపులు విని ఇంట్లోకి వ‌చ్చిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఇద్ద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. బాలుడు అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు ధృవికీరించారు. త‌ల్లి ప్రాణాల‌కు ప్రమాద‌మేమీ లేదని చెప్పారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడు గాజ‌లింగ‌ప్ప‌ను అరెస్ట్ చేసి, అత‌ని నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. 

ఇవి కూడా చ‌ద‌వండి..

వ్యాపారి హత్య కోసం వచ్చి ఇద్దరు మహిళలపై లైంగికదాడి

రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం

రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

జనవరి మొదటివారం నుంచి స్టాలిన్‌ ఎన్నికల ప్రచారం

కోయంబ‌త్తూర్‌లో కేక్ షో.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్ క‌రోనా కేక్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.      


logo