మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 26, 2020 , 19:31:11

పెండ్లి పేరుతో మోసం.. యువ‌తిపై ఏడాదిగా అత్యాచారం!

పెండ్లి పేరుతో మోసం.. యువ‌తిపై ఏడాదిగా అత్యాచారం!

అహ్మ‌దాబాద్: గుజ‌రాత్ రాష్ట్రం అహ్మదాబాద్ న‌గ‌రంలోని కేడియా ప్రాంతంలో దారుణం జ‌రిగింది. స్థానికుడైన ఓ యువ‌కుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని ప్రాంతానికి చెందిన యువ‌తిని సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యం చేసుకుని అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. పెండ్లి చేసుకుందామ‌ని న‌మ్మిస్తూ ఏడాదికిపైగా ప‌లు ద‌ఫాల్లో ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. అయితే ఉన్న‌ట్టుండి గ‌త రెండు నెల‌లుగా ముఖం చేశాడు. దాంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వచ్చింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. జిడ్డి ల‌డ్కా పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క‌లిగిన 20 ఏండ్ల‌ యువ‌కుడు 2019 జూన్‌లో ఉజ్జ‌యినికి చెందిన 22 ఏండ్ల యువ‌తికి ఫాలో రిక్వెస్ట్ పంపించాడు. ఆ రిక్వెస్ట్‌ను స‌ద‌రు యువ‌తి యాక్సెప్ట్ చేయ‌డంతో వారు త‌ర‌చుగా చాటింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు యువ‌కుడు 2019 ఆగ‌స్టులో బ్లేడుతో చేయి కోసుకున్న ఫొటోల‌ను యువతికి పంపించాడు. ఆమె త‌న‌ను క‌లిసేందుకు అహ్మ‌దాబాద్‌కు రాక‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించాడు. 

దాంతో నిజంగానే ఆత్మ‌హ‌త్య‌కు చేసుకుంటాడేమోన‌ని భ‌య‌పడిన యువ‌తి అహ్మ‌దాబాద్‌కు వెళ్లింది. అక్క‌డ ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లిన యువ‌కుడు పెండ్లి చేసుకుందామంటూ మాయ‌మాట‌లు చెప్పి ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. మూడు రోజుల‌పాటు హోట‌ల్‌లోనే ఉంచి అఘాయిత్యం చేశాడు. అనంత‌రం 2019 అక్టోబ‌ర్‌లో మ‌రోసారి యువ‌తిని అహ్మ‌దాబాద్‌కు ఆహ్వానించి ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. ఇలా 2020 అక్టోబ‌ర్ వ‌ర‌కు స‌ద‌రు యువ‌కుడు ఆమెపై అఘాయిత్యం చేశాడు. 

అయితే, గ‌త రెండు నెల‌ల నుంచి అత‌డు ముఖం చాటేయడంతో బాధిత యువ‌తి మోసపోయాన‌ని గ్ర‌హించింది. ఉజ్జ‌యిని పోలీసులకు జ‌రిగిందంటూ వివ‌రిస్తూ ఫిర్యాదు చేసింది. యువ‌తి ఫిర్యాదును స్వీక‌రించిన‌ పోలీసులు.. నేరం అహ్మ‌దాబాద్‌లోని కేడియా ప్రాంతంలో జ‌రిగినందున కేసును అక్క‌డికి బ‌దిలీ చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo