మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 18, 2020 , 17:09:14

బాలిక‌ను అత్యాచారం చేసి గ‌ర్భ‌వ‌తిని చేసిన వైనం

బాలిక‌ను అత్యాచారం చేసి గ‌ర్భ‌వ‌తిని చేసిన వైనం

ల‌క్నో : బాలిక‌పై అత్యాచారం చేసి గ‌ర్భ‌వ‌తిని చేసిన వైనం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. జ్ఞాన్పూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో 15 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున‌ త‌న క‌జిన్‌పై ఓ వ్య‌క్తి గ‌త కొంత కాలంగా అత్యాచారానికి పాల్ప‌డుతూ గ‌ర్భ‌వ‌తిని చేసిన‌ట్లు స‌ర్కిల్ ఆఫిస‌ర్ క‌లు సింగ్ తెలిపారు. అనారోగ్యం కార‌ణంగా బాలికను ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌గా విష‌యం వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు చెప్పాడు. బాధితురాలు స్పందిస్తూ... విష‌యాన్ని ఏవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు గురిచేసిట‌న‌ట్లు పేర్కొంది. కేసు న‌మోదు చేసి నిందితుడి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్ల‌డించారు. బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌లకు పంపిన‌ట్లు పేర్కొన్నారు. 


logo