సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 18:13:55

కోడలితో శృంగారం వద్దు.. ఆమెలో దెయ్యం ఉంది..

కోడలితో శృంగారం వద్దు.. ఆమెలో దెయ్యం ఉంది..

అహ్మదాబాద్‌ : తన కుమారుడితో శృంగారం వద్దని కోడలిని ఓ మామ వేధించాడు. కోడలితో కొడుకు శృంగారం చేస్తే ఆమెలో ఉన్న దెయ్యం అతనిలోకి వెళ్తుందని, ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని పచ్చని కాపురంలో మామ చిచ్చుపెట్టాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో వెలుగు చూసింది. 

వడోదర జిల్లాలోని అల్కాపురికి చెందిన 43 ఏళ్ల మహిళకు కొన్నేళ్ల క్రితం.. గాంధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే ఇటీవల కాలంలో కోడలిని మామ తన కుమారుడికి దూరంగా ఉంచుతున్నాడు. ఎందుకంటే.. కోడలిలో దెయ్యం ఉందని మామ నమ్ముతున్నాడు. కొడుకు, కోడలు శృంగారంలో పాల్గొంటే.. ఆమెలోని దెయ్యం అతనిలోకి వెళ్తుందట. దీంతో ఇద్దరిని పడక గదికి దూరంగా ఉంచుతూ మామ వేధిస్తున్నాడు.

ఈ అనాగరిక ఆలోచనలపై కోడలు గళమెత్తింది. మూర్ఖంగా ఆలోచిస్తున్నారని, తనలో ఎలాంటి ఆత్మలు లేవని చెప్పింది. దీంతో కోడలిని అత్తమామలు క్రూరంగా హింసించి కొట్టారు. అంతేకాకుండా తాను ఒంటరిగా ఉన్న సమయంలో తనతో శృంగారానికి మామను అత్త ఒత్తిడి చేసేదని బాధితురాలు పేర్కొంది. ఈ వేధింపులు తాళలేక ఈ ఏడాది మార్చి 10న అత్తమామలు, భర్త నుంచి విడిపోయింది. కొద్ది రోజులకు తన భర్త రాజీకి వచ్చాడు.. కానీ అత్తమామలు తనను వదిలించుకోవాలని చూస్తున్నారని తెలిపింది బాధితురాలు. అత్తమామల ఆగడాలపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


logo