శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 22:30:54

జ్యూడిషియ‌ల్ అధికారిగా న‌మ్మించి కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిన వ్య‌క్తి అరెస్టు

జ్యూడిషియ‌ల్ అధికారిగా న‌మ్మించి కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిన వ్య‌క్తి అరెస్టు

క‌రీంన‌గ‌ర్ : వ‌ఇవ వివిధ కోర్టులు, ఇత‌ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని న‌మ్మ‌బ‌లుకుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న దోమాల ర‌మేశ్ అనే వ్య‌క్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. న‌కిలీ డాక్యుమెంట్లు, న‌కిలీ అపాయింట్‌మెంట్ లెట‌ర్స్‌, స్టాంప్స్‌, ప్రామిస‌రీ నోట్స్‌, బ్యాంక్ అకౌంట్ వివ‌రాల‌తో పాటు ఇత‌ర వ‌స్తువుల‌ను పోలీసులు సీజ్ చేశారు. సీపీ క‌మ‌లాస‌న్ రెడ్డి మీడియా ద్వారా వివ‌రాల‌ను తెలుపుతూ... దోమాల ర‌మేశ్ వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా బీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండ‌లం మ‌ణిక్యాపూర్ గ్రామ నివాసి. సివిల్ త‌గాదాలు తీర్చేందుక‌ని ర‌మేశ్ హుజురాబాద్‌లో కార్యాల‌యాన్ని తెరిచాడు.

ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన జ్యూడిషియ‌ల్ ఆఫీస‌ర్‌గా త‌న‌కు తాను చెప్పుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడు. విజిలెన్స్ అధికారిగా చూపించుకునేందుకు రెండు కార్లు కొని న్యాయ‌శాఖ స్టిక్క‌ర్ల‌ను అతికించాడు. వివిధ కోర్టుల్లో, ఇత‌ర ప్ర‌భుత్వ‌రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని చెప్పి ప‌లువురి వ‌ద్ద నుంచి రూ. 4 కోట్లు వ‌సూలు చేశాడు. ర‌మేశ్ 2017లో సైతం మంచిర్యాల జిల్లా రామ‌కృష్ణాపూర్‌లోని జెడ్‌పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు ఐడీ కార్డు సృష్టించాడు. 2018లో అప్ప‌టి విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి పేరిట న‌కిలీ నియామ‌క లేఖ‌ల‌ను కూడా సృష్టించాడు.  


logo