శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 20, 2020 , 17:11:17

తండ్రి కాదు క్రూర మృగం.. ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం

తండ్రి కాదు క్రూర మృగం.. ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం

అహ్మ‌దాబాద్ : క‌ంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన తండ్రే.. త‌న ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఆ చిన్నారి ప్ర‌యివేటు భాగాల్లో కర్ర‌ను చొప్పించి.. తీవ్ర గాయాల పాలు చేశాడు. ఈ దారుణ సంఘ‌ట‌న గుజ‌రాత్ లోని సోలా ప్రాంతంలోని మురికివాడ‌లో గురువారం సాయంత్రం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

మురికివాడ‌లోని ఓ 35 ఏళ్ల‌ వ్య‌క్తికి భార్య‌, ముగ్గురు ఆడ పిల్ల‌లు ఉన్నారు. తండ్రి మ‌ద్యానికి బానిస అయ్యాడు. త‌ల్లి కూలీగా ప‌ని చేస్తూ వ‌చ్చిన డ‌బ్బుతో కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే గురువార సాయ‌త్రం 4:30 గంట‌ల స‌మ‌యంలో చిన్న కుమార్తె(5)ను తండ్రి.. నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లాడు. అక్క‌డ ఆ చిన్నారి ప‌ట్ల క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. ఆమె ప్ర‌యివేటు భాగాల్లో క‌ర్ర‌ను చొప్పించి ర‌క్షాస ఆనందం పొందాడు.

తీవ్ర ర‌క్త‌స్రావ‌మైన బిడ్డ‌ను అర గంట త‌ర్వాత ఇంటి వ‌ద్ద‌కు తీసుకొచ్చాడు. అప్పుడే త‌ల్లి కూడా ఇంటికి వ‌చ్చింది. ర‌క్త స్రావంతో బాధ‌ప‌డుతున్న బిడ్డ‌కు స్నానం చేయించి.. ఆస్ప‌త్రికి తీసుకెళ్లింది. ఆ స‌మ‌యంలోనే ఏం జ‌రిగింద‌ని భ‌ర్త‌ను భార్య నిల‌దీయ‌డంతో.. చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. 

మ‌రుస‌టి రోజు త‌ల్లి.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం అత‌ను ప‌రారీలో ఉన్నాడు. దుండ‌గుడిపై అత్యాచారం, పోక్సో చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేశారు.  గ‌తంలో కూడా మిగ‌తా కుమార్తెల‌తోనూ ఈ విధంగానే అత‌ను ప్ర‌వ‌ర్తించిన‌ట్లు భార్య త‌న ఫిర్యాదులో పేర్కొంది.   


logo