గురువారం 04 జూన్ 2020
Crime - Mar 03, 2020 , 14:57:05

ప్రియుడే యముడయ్యాడు..

ప్రియుడే యముడయ్యాడు..

తమిళనాడు: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి పాలిట ఆమె ప్రియుడే యముడయ్యాడు. నోట్లో విషం పోసి చంపేశాడు. ఈ దారుణం తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. దినేష్‌, నందిని గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిరువురూ.. త్వరలోనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కాగా, ప్రియురాలు నందిని.. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి నిత్యం వాయిదా వేస్తున్నదని దినేష్‌ ఆగ్రహించాడు. దీంతో, ప్రియురాలిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఓ సారి కలుద్దామని ప్రియురాలిని నమ్మించి, పిలిపించిన దినేష్‌.. ఆమెతో మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె అందుకు నిరాకరించింది. 

మరి కొన్ని నెలల అనంతరం వివాహం చేసుకుందామని తెలిపింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన దినేష్‌.. తనతో ముందుగానే తెచ్చుకున్న విషాన్ని నందిని నోట్లో బలవంతంగా పోశాడు. తప్పించుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నించినా.. అతడు వదల్లేదు. పూర్తిగా విషం ఆమె నోట్లో పోశాడు. దీంతో, నందిని అక్కడికక్కడే మరణించింది. 

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు దినేష్‌ను అరెస్ట్‌ చేశారు. మరణించిన నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.


logo