సోమవారం 26 అక్టోబర్ 2020
Crime - Sep 26, 2020 , 18:10:57

వేముల‌వాడ‌లో వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌

వేముల‌వాడ‌లో వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌

రాజ‌న్న సిరిసిల్ల : జిల్లాలోని వేముల‌వాడ‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ప‌ట్ట‌ణానికి చెందిన కొరేపు రాజు, శ్రీ‌నివాస్ గౌడ్ ఇరువురి మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ఈ క్ర‌మంలో శ్రీ‌నివాస్ గౌడ్‌పై రాజు గొడ్డ‌లితో దాడి చేశాడు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ వ్యక్తిని హుటాహుటిన వేముల‌వాడలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా మృతిచెందాడు. ఘ‌ర్ష‌ణ‌కు గ‌ల కార‌ణం తెలియాల్సి ఉంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు.


logo