సోమవారం 06 జూలై 2020
Crime - Jun 02, 2020 , 11:05:39

రంగపేటలో వ్యక్తి దారుణ హత్య

రంగపేటలో వ్యక్తి దారుణ హత్య

మంచిర్యాల : జిల్లాలోని బెల్లంపల్లి మండలం రంగపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు చెల్లూరి దుర్గయ్య అనే వ్యక్తిని బండరాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.


logo