బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 05, 2020 , 12:16:28

కుటుంబ క‌ల‌హాల‌తో భార్య‌ను చంపిన భ‌ర్త‌

కుటుంబ క‌ల‌హాల‌తో భార్య‌ను చంపిన భ‌ర్త‌

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని జ‌గ‌ద్గిరిగుట్టలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ క‌ల‌హాల‌తో ఓ వ్య‌క్తి భార్యను హ‌త‌మార్చాడు. జ‌గ‌ద్గిరిగుట్ట‌లోని రాజీవ్‌గృహ‌క‌ల్పలో భార్యాభ‌ర్త‌లు మార్త (31), కిష‌న్ నివాసం ఉంటున్నారు. వారిద్ద‌రిమ‌ధ్య గ‌త కొంత‌కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న రాత్రికూడా ఇరువురు ఘ‌ర్ష‌ణ‌ప‌డ్డారు. దీంతో మార్తను క‌త్తితోపొడిచి హ‌త్య‌చేశాడు. అనంత‌రం జ‌గ‌ద్గిరిగుట్ట పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయాడు. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న‌ పోలీసులు హ‌త్య‌కు ఉప‌యోగించిన క‌త్తిని స్వాధీనం చేసుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఘ‌ట‌న ఈరోజు తెల్వారుజామున 4 గంట‌ల స‌మ‌యంలో జ‌రిగిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.