గురువారం 26 నవంబర్ 2020
Crime - Feb 01, 2020 , 21:36:48

భార్యను హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన భర్త

మధిర రూరల్‌: ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నంలో  కుటుంబ కలహాలతో భార్యను భర్త హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాయపట్నం గ్రామానికి చెందిన తేళ్ల వెంకటప్రసాద్‌, శ్రీలతలకు పదిహేనేళ్ల కిందట  వివాహమైంది. వీరికి సాయి, స్వాతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త వెంకటప్రసాద్‌ కొంతకాలంగా తరచూ గొడవ పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో వీరి మధ్య మనస్పర్థలు పెరిగి ఒకే ఇంట్లో వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య శ్రీలత(35)ను వెంకటప్రసాద్‌ గొంతు నులిమి హతమార్చి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మధిర సీఐ వేణుమాధవ్‌.. మధిర పట్ణ ఎస్సై ఉదయ్‌ కుమార్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి   ఘటన వివరాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.