సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 15, 2020 , 17:41:47

భార్యాపిల్ల‌ల గొంతుకోసి భర్త ఆత్మ‌హ‌త్య‌

భార్యాపిల్ల‌ల గొంతుకోసి భర్త ఆత్మ‌హ‌త్య‌

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం సాత్నా జిల్లాలో విషాదక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. జిల్లాలోని మ‌జ్‌గావ‌న్ ప‌ట్ట‌ణం నాయ్ బ‌స్తీ ఏరియాకు చెందిన ధ‌ర్ము వ‌ర్మ (37) అనే వ్య‌క్తి భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను గొంతు కోసి చంపేశాడు. అనంత‌రం తాను కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మంగ‌ళ‌వారం ఉద‌యం 11.30 గంట‌లు అయినా ఇంట్లోంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వ‌చ్చి పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. 

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఇంటి త‌లుపులు ప‌గుల‌గొట్టి చూడ‌గా ధ‌ర్ము వ‌ర్మ ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించాడు. లోప‌లి గ‌దిలో భార్య, పిల్ల‌లు విగ‌త‌జీవులై ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిఉన్నారు. భార్య వ‌య‌సు 32 ఏండ్లు ఉంటుంద‌ని, పిల్ల‌ల్లో ఒక‌రికి ఐదేండ్లు కాగా, మ‌రొక‌రికి ఏడాది వ‌య‌సు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కుగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌న్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo