సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 09:11:17

కాపురానికి రానన్న భార్య.. ఇద్దరు కుమారులను చంపి తానూ ఉరేసుకొని..

కాపురానికి రానన్న భార్య.. ఇద్దరు కుమారులను చంపి తానూ ఉరేసుకొని..

బాలాఘాట్ : మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కోపంతో వ్యక్తి తన ఇద్దరు కుమారులను చంపి తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కచ్చార్టోలా గ్రామానికి చెందిన భురాసింగ్‌ పునం (27) భార్యతోపాటు ఆరేండ్లలోపు ముగ్గురు కుమారులతో స్థానికంగా ఉంటున్నాడు. ఇటీవల భార్యాభర్తల నడుమ గొడవ జరగడంతో భార్య కుమారులను తీసుకొని సోన్పురిలోని పుట్టింటికి వెళ్లింది. భార్యను తీసుకువచ్చేందుకు పునం అత్తింటికి వెళ్లగా వచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన అతడు భార్య ఇంట్లో లేని సమయంలో కుమారులు సమీర్ (6), కైలాష్ (4) గొంతు పిసికి హతమార్చాడు. చిన్న కుమారుడు ఆకాశ్‌(1) సైతం చంపేందుకు యత్నిస్తుండగా బంధువులు గుర్తించడంతో పారిపోయి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బాలాఘాట్ ఎస్పీ అభిషేక్ తివారీ తెలిపారు. పోలీసులకు చిన్నారి ఆకాశ్‌ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. పుసం మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం
కుటుంబీకులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo