సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 16:28:12

ఎకరం భూమి కోసం కన్నతల్లిని కర్కషంగా నరికేశాడు..

ఎకరం భూమి కోసం కన్నతల్లిని కర్కషంగా నరికేశాడు..

విజయవాడ : ఆస్తికోసం ఓ కొడుకు కన్నతల్లిని కరష్కంగా గొడ్డలితో నరికి చంపాడు. తనకు కాకుండా సోదరుడి కుమారుడికి భూమి ఇచ్చేందుకు చూస్తుందన్న అనుమానంతో ఘాతుకానికి ఒడిగట్టాడు.  గుంటూర్ జిల్లా రొంపిచర్ల మండలం అన్నారం గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. అన్నారం గ్రామానికి చెందిన కొండేటి తిరుపతమ్మ (80)కి ఇద్దరు కుమారులు. తిరుపతమ్మ పేర ఎకరం భూమి ఉంది. ఆమె ఆలనా పాలనపై చిన్నకుమారుడు కొండేటి ఏడుకొండలు కొంత అశ్రద్ధ చూపడంతో మనువడి (పెద్ద కుమారుడి కొడుకు) వద్ద ఉంటోంది. దీంతో భూమి సైతం అన్నకొడుకుకే ఇచ్చేస్తుందన్న అనుమానంతో ఏడుకొండలు తల్లిపై పగ పెంచుకున్నాడు. శనివారం మద్యం మత్తులో తల్లి ఉంటున్న ఇంటికి వచ్చి గొడ్డలితో నరికేశాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఘటనా స్థలం నుంచి ఏడుకొండలు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo