శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 16:08:22

చంప‌మ‌ని కొడుకును వేడుకున్న త‌ల్లి

చంప‌మ‌ని కొడుకును వేడుకున్న త‌ల్లి

చెన్నై : ఓ త‌ల్లి అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఆస్ప‌త్రుల చుట్టూ కాళ్ల‌రిగేలా తిరుగుతోంది. కానీ ఆరోగ్యం మెరుగుప‌డ‌డం లేదు. ఏ ఆస్ప‌త్రికి రాను.. త‌న‌కు ఆరోగ్యం కుదుట‌ప‌డ‌దు. త‌న‌ను చంపేయ‌మ‌ని ఓ త‌ల్లి త‌న కొడుకును వేడుకుంది. దీంతో అత‌ను.. త‌ల్లిని చంపేశాడు. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కంచీపురం జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

కంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ ప‌ట్ట‌ణానికి చెందిన గోవింద‌మ్మ‌ల్(66) త‌న భ‌ర్త‌, కుమారుడితో క‌లిసి ఉంటోంది. గోవింద‌మ్మ‌ల్ క్ష‌య‌, డ‌యాబెటిస్ వ్యాధితో బాధ‌ప‌డుతుంది. దీంతో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఆమె చికిత్స తీసుకుంది. అప్ప‌ట్నుంచి ఆమె ఆస్ప‌త్రుల చుట్టూ తిరుగుతోంది. 

జులై 24న ఆస్ప‌త్రికి వెళ్దామ‌ని త‌ల్లిని కుమారుడు ఆనంద‌న్ అడిగాడు. తాను ఏ ఆస్ప‌త్రికి రాను. రోగం న‌యం కాదు. ఈ బాధ‌ల‌ను భ‌రించ‌లేను.. త‌న‌ను చంపేయ్ అని కుమారుడిని వేడుకుంది. ఈ క్ర‌మంలో జులై 27వ తేదీన కిచెన్ కత్తితో త‌ల్లి గొంతు కోసి చంపాడు. 

ఘ‌టనాస్థ‌లికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు త‌ర‌లించారు. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. భ‌రించ‌లేని బాధ‌తో బాధ‌ప‌డుతున్నందుకు త‌ల్లిని చంపాన‌ని నిందితుడు ఒప్పుకున్నాడు. త‌న‌కు రోగం నయం కాదు.. చంపేయండి అని త‌ల్లి వేడుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో నిందితుడు పేర్కొన్నాడు.


logo