శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 23, 2020 , 13:31:06

బెంగ‌ళూరులో భార్య‌ను, కోల్‌క‌తాలో అత్త‌ను చంపి ఆత్మ‌హ‌త్య‌!

బెంగ‌ళూరులో భార్య‌ను, కోల్‌క‌తాలో అత్త‌ను చంపి ఆత్మ‌హ‌త్య‌!

కోల్‌క‌తా: బెంగ‌ళూరు, కోల్‌క‌తా న‌గ‌రాల్లో దారుణం జ‌రిగింది. అమిత్ అగ‌ర్వాల్ అనే ఒక వ్య‌క్తి అత్త‌ను, భార్య‌ను చంపి తాను కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ముందుగా బెంగ‌ళూరులో భార్య శిల్పిని చంపిన అమిత్ అగ‌ర్వాల్‌.. అక్క‌డి నుంచి నేరుగా విమానంలో కోల్‌క‌తాకు వెళ్లాడు. అక్క‌డ అత్త ల‌లిత దందానియాను కాల్చి చంపాడు. అనంత‌రం త‌న‌ను తాను షూట్ చేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బెంగ‌ళూరుకు చెందిన అమిత్ అగ‌ర్వాల్‌కు భార్య శిల్పితో విభేదాలు త‌లెత్తాయి. గొడ‌వ‌లు మ‌రింత ముదర‌డంతో విడాకుల కోసం ఇద్ద‌రూ కోర్టుకు వెళ్లారు. ప్ర‌స్తుతం కోర్టులో కేసు న‌డుస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఉద‌యం అమిత్ అగ‌ర్వాల్ బెంగ‌ళూరులోని భార్య ఫ్లాట్‌కు వెళ్లి ఆమెను కాల్చిచంపాడు. అక్క‌డి నుంచి నేరుగా విమానంలో కోల్‌క‌తాకు వెళ్లి అత్త‌మామ‌ల‌తో గొడ‌వ‌ప‌డ్డాడు. 

మాటామాటా పెరుగడంతో అత్త ల‌లిత దందానియాను షూట్ చేశాడు. దీంతో భ‌యంతో త‌ప్పించుకుని పారిపోయిన మామ సుభాష్ దందానియా పోలీసులకు స‌మాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకునేస‌రికి అమిత్ అగ‌ర్వాల్ కూడా ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్నాడు. అనంత‌రం పోలీసులు అమిత్ అగ‌ర్వాల్‌ జేబులో సూసైడ్ నోట్‌ను గుర్తించారు. 

జీవితంలో త‌న‌కు ప్ర‌శాంత‌త లేకుండా చేసినందుకు బెంగ‌ళూరులో భార్య‌ను, కోల్‌క‌తాలో అత్త‌ను హ‌త్య‌చేసి తాను ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు సూసైడ్ నోట్‌లో అమిత్ అగ‌ర్వాల్ పేర్కొన్నారు. దీంతో కోల్‌క‌తా పోలీసులు బెంగ‌ళూరు పోలీసుల‌కు శిల్ప హ‌త్య‌పై స‌మాచారం ఇచ్చారు. దీంతో శిల్ప ఫ్లాట్‌కు వెళ్లి ఆమె హ‌త్య‌కు గురైన విష‌యాన్ని బెంగ‌ళూరు పోలీసులు ధృవీక‌రించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌ల‌పై కోల్‌క‌తా, బెంగ‌ళూరు పోలీసులు వేర్వేరు కేసులు న‌మోదు చేసిన ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo