మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 18, 2020 , 15:40:59

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి ?

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి ?

సంగారెడ్డి : చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని హత్నూర మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బుద్వేల్ జిల్లా అంగీసి గ్రామానికి చెందిన పాల్ సింగ్(40) కొంత కాలంగా జిన్నారం మండలం సోలక్పల్లి శివారులోని ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. ఈ నెల 16న (బుధవారం) చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ రోజు హత్నూర మండలం ఎల్లమ్మగూడ శివారులోని పెద్ద చెరువులో శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo