బుధవారం 20 జనవరి 2021
Crime - Nov 29, 2020 , 15:38:37

రూ.200 అడిగితే లేవ‌న్నాడ‌ని వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌

రూ.200 అడిగితే లేవ‌న్నాడ‌ని వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అలీగ‌ఢ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. కేవ‌లం రూ.200 కోసం ఒక వ్య‌క్తి మ‌రో వ్య‌క్తిని హ‌త్య‌చేశాడు. సివిల్ లైన్స్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని శంష‌ద్ మార్కెట్ ఏరియాలో శ‌నివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. అన్సార్ అహ్మ‌ద్ అనే ముగ్గురు పిల్లల తండ్రి శంష‌ద్ మార్కెట్‌లో ఒక టైర్ రిపేరింగ్ షాప్ న‌డుతుపుతున్నాడు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సాయంత్రం ఆసిఫ్ అనే ఒక తాగుబోతు అత‌ని ద‌గ్గ‌రికి వ‌చ్చి కొద్దిసేపు బైక్ ఇవ్వ‌మ‌ని కోరాడు. 

అందుకు అన్సార్ అహ్మ‌ద్ ఒప్పుకోలేదు. ఆ రోజుకు సైలెంట్‌గా వెళ్లిపోయిన ఆసిఫ్.. శ‌నివారం సాయంత్రం మ‌ళ్లీ అన్సార్ అహ్మ‌ద్ ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. రూ.200 కావాల‌ని అడిగాడు. అందుకు అన్సార్ నిరాక‌రించ‌డంతో జేబులోంచి నాటు తుపాకీ తీసి త‌ల‌పై కాల్చాడు. దాంతో అన్సార్ అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలి ప్రాణాలు విడిచాడు. ప‌క్క‌న ఉన్నవాళ్ల‌కు ఏం జ‌రుగుతుందే అర్థ‌మ‌య్యేలోపే నిందితుడు అక్క‌డి నుంచి జారుకున్నాడు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.    


logo