e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home క్రైమ్‌ హఫీజ్‌పేట్‌లో రైలుఢీకొని వ్యక్తి మృతి

హఫీజ్‌పేట్‌లో రైలుఢీకొని వ్యక్తి మృతి

హఫీజ్‌పేట్: రైలుఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన హఫీజ్‌పేట్‌ రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకున్నది. రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ నర్సింహరావు తెలిపిన వివరాల ప్రకారం…సుమారు 55 సంవత్సరాలుగల ఓవ్యక్తి రైలుపట్టాలపై 173/15-17 ప్రాంతంలో మంగళవారం ఉదయం నడుచుకుంటూ వెళుతుండగా వెనకవైపునుంచి వస్తున్న గుర్తుతెలియని రైలుఢీకొట్టింది. దీంతో త‌లకు, ఇతర శరీర బాగాలకు తీవ్రగాయాలుకావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసునమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన వ్యక్తి నలుపు, తెలుపు రంగుచొక్కా బ్లూకలర్‌ జీన్స్​‍ప్యాంటు, కట్‌షూలు ధరించి ఉన్నాడు. వేషధారణను బ‌ట్టి ముస్లీం వ్యక్తిగా అనుమానిస్తున్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ నర్సింహరావును 9000394635లో సంప్రదించాలన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement