ఆదివారం 25 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 11:59:22

ప్రాణాలను బలిగొన్న హెడ్ ఫోన్స్

ప్రాణాలను బలిగొన్న హెడ్ ఫోన్స్

రంగారెడ్డి : హెడ్ ఫోన్స్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ.. రైలును ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలైన విషాద ఘటన జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా సమీపంలోని రైల్వే ట్రాక్ పై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..రాయికల్ బురుజు గడ్డ తండాకు చెందిన మూడవత్ రాంసింగ్ డబుల్ లైన్ రైల్వే ట్రాక్ పై ఫోన్ మాట్లాడుతూ నిలుచున్నాడు. పాత రైల్వే ట్రాక్ పై రైలు వస్తుందనే భావనతో కొత్త రైల్వే ట్రాక్ పై నిలుచుని ఫోన్ మాట్లాడుతున్నాడు. చెవిలో హెడ్ ఫోన్స్ ఉండటంతో రైలు వచ్చే శబ్దం వినిపించలేదు. దీంతో రైలు సమీపించి రాంసింగ్ ను ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే రాంసింగ్ దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo