గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 16:57:41

ఆర్టీసీ బస్సు ఢీకొని.. వ్యక్తి దుర్మరణం

ఆర్టీసీ బస్సు ఢీకొని.. వ్యక్తి దుర్మరణం

వరంగల్ రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహణదారుడు దుర్మరణం చెందిన విషాద ఘటన జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన నరసింహుల రాజుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
logo