ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 22:18:23

రోడ్డు ప్రమాదంలో వ్య‌క్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్య‌క్తి మృతి

యాదాద్రి భువనగిరి : రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న చౌటుప్ప‌ల్ మండ‌లం పంతంగి గ్రామ స‌మీపంలో ఎన్‌హెచ్ 64పై బుధ‌వారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాలు.. పంతంగి గ్రామానికి చెందిన బాతరాజు శ్రీ‌ను (40) వ్య‌క్తిగ‌త ప‌ని నిమిత్తం రోడ్డు దాటుతుండ‌గా.. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వెళ్తున్న షిఫ్ట్ కారు వేగంగా వ‌చ్చి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో శ్రీ‌ను అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.  అయితే జాతీయ ర‌హ‌దారిపై లైట్లు లేక‌పోవ‌డం వ‌ల్లే నిత్యం ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయ‌ని గ్రామ‌స్తులు రాస్తారోకో చేయ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని వారిని చెద‌ర‌గొట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo