Crime
- Nov 02, 2020 , 09:02:34
జగిత్యాలలో అప్పు తీర్చడంలేదని వ్యక్తి హత్య

జగిత్యాల: అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న గాంధీనగర్లో తీపిరెడ్డి గంగారెడ్డిని ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య చేశారు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో నరేష్, శ్రీధర్ అనే యువకులు హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. గంగారెడ్డిని ఉరి వేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
తాజావార్తలు
MOST READ
TRENDING