Crime
- Dec 01, 2020 , 17:48:57
కారు ఢీకొని వ్యక్తి మృతి

మేడ్చల్-మల్కాజిగిరి : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన జిల్లాలోని ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అన్నోజిగూడలోని ఎన్టీపీసీ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి అన్నోజిగూడ ఎన్టీపీసీ చౌరస్తా వద్ద రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన పిడమర్తి సురేష్(55) సోమవారం రాత్రి నడుచుకుంటు రోడ్డు దాటుతుండగా ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వేగంగా వెళ్తున్న వ్యాగనార్ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన సురేష్‌ను 108 వాహనంలో క్యూర్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
MOST READ
TRENDING