గురువారం 04 మార్చి 2021
Crime - Jun 12, 2020 , 16:26:04

కారు, బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

కారు, బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

సూర్యాపేట : కారు, బైక్‌ ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని రెడ్లకుంట గ్రామశివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా వర్సవాయి మండలం మంగోలు గ్రామానికి చెందిన జడ గోపి(25) అన్నారం గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు బైక్‌ పై తన బంధువుతో కలిసి వెళ్లి వస్తున్నాడు.

కోదాడ మండలం రెడ్లకుంట గ్రామశివారుకు రాగానే రామాపురం వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో గోపి అక్కడికక్కడే మృతి చెందగా.. తనతో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.


VIDEOS

తాజావార్తలు


logo