సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 23, 2020 , 12:45:36

బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ మండలంలోని ఆరెపల్లి సమీపంలో ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందారు. ఆరేపల్లికి చెందిన మోహన్‌ రావు నిన్న రాత్రి మోటారు సైకిల్‌పై సిరిసిల్ల నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. అయితే కరీంనగర్‌ నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కారు అతని బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo