శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 25, 2020 , 08:06:31

ఖమ్మంలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

ఖమ్మంలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

ఖమ్మం: ఖమ్మంలోని మయూరి బ్రిడ్జిపై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపైనుంచి వెళ్తున్న మోటారు సైకిల్‌ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో యువకుడు మృతిచెందాడు. మరణించిన వ్యక్తి ఖమ్మం గ్రామీణ మండలం నాయుడుపేటకు చెందిన సంపత్‌ (24)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కారు ఢీకొట్టడంతో అతడు బ్రిడ్జిపై నుంచి పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo