బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jun 27, 2020 , 21:18:37

బైక్ ను ఢీకొట్టిన అడ‌వి పంది.. వ్య‌క్తి మృతి

బైక్ ను ఢీకొట్టిన అడ‌వి పంది.. వ్య‌క్తి మృతి

సంగారెడ్డి : న‌ర్సాపూర్ నుంచి సంగారెడ్డి వ‌స్తున్న ఓ బైక్ కు అడ్డంగా అడ‌వి పంది వ‌చ్చింది. ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ పంది బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్ పై వెళ్తున్న 46 ఏళ్ల వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదం సంగారెడ్డికి స‌మీపంలోని ఆరుట్ల రోడ్డులో చోటు చేసుకుంది. క్ష‌త‌గాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. చికిత్స పొందుతూ అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని పాస్ట‌ర్ ఎన్ స్వామి దాస్ గా పోలీసులు గుర్తించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.


logo