గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 25, 2020 , 12:43:01

ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న

ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న

ఔరంగాబాద్‌ : ఆస్తి తగాదా సోదరుల మధ్య చిచ్చు రేపింది. రక్తసంబంధీకుడి రక్తాన్ని కళ్ల జూసేలా చేసింది. ఆస్తి కోసం తమ్ముడిని కత్తితో పొడిచి చంపగా అన్నను అరెస్టు చేసిన ఘటన శుక్రవారం మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పైథాన్‌ నగరానికి చెందిన వేద్‌ప్రకాశ్‌ రామ్‌నాథ్‌ ఠాకూర్‌ (57), సూర్యప్రకాశ్‌(54) అన్నదమ్ములు. గత కొన్నిరోజులుగా వీరిరువురి మధ్య ఆస్తికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తమ్ముడు సూర్యప్రకాశ్‌ ఇంటికి శుక్రవారం అన్న వేద్‌ప్రకాశ్‌ వచ్చి ఒక ప్లాట్‌లో వాటా, ఇల్లు కొనడానికి రూ .2లక్షలు కావాలని డిమాండ్‌ చేశాడు. తన వద్ద డబ్బు లేదు, వాటా కూడా ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదని సూర్యప్రకాశ్‌ తేల్చి చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన వేద్‌ తమ్ముడి భార్య బైటికెళ్లిన సమయం చూసి సూర్యప్రకాశ్‌ను కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానికులు భార్యకు సమాచారం అందించి దవాఖానకు తరలించేలోగా సూర్యప్రకాశ్‌ మరణించాడు. సీసీఫుటేజీ ఆధారంగా వేద్‌ప్రకాష్ ఠాకూర్‌ను జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo