మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 11:48:52

అమీర్‌పేట‌లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌

అమీర్‌పేట‌లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని అమీర్‌పేట‌లో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ధ‌రంక‌రం రోడ్డులోని ఓ అపార్టుమెంటులో చంద్ర‌శేఖ‌ర్ అనే వ్య‌క్తిని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు. భార్య హ‌త్య‌కేసులో చంద్ర‌శేఖ‌ర్ ఇటీవ‌లే జైలు నుంచి విడుద‌య్యాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కుటుంబ క‌ల‌హాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు న‌మోదుచేసిన ఎస్సార్‌న‌గ‌ర్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.    


logo