శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 14, 2020 , 18:10:50

నారాయ‌ణ‌గూడ‌ మెట్రోస్టేష‌న్ వ‌ద్ద వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌

నారాయ‌ణ‌గూడ‌ మెట్రోస్టేష‌న్ వ‌ద్ద వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌

హైద‌రాబాద్‌: నారాయణగూడలో దారుణం జరిగింది. మెట్రోస్టేషన్ ద‌గ్గ‌ర‌ గుర్తుతెలియని వ్యక్తి దారుణ‌హత్యకు గురయ్యాడు. త‌ల‌పై బండ‌రాయితో మోదీ హ‌త్య‌చేశారు. స్టేష‌న్ కింద‌నే వ్య‌క్తి హ‌త్య‌కు గురై ప‌డి ఉండ‌టం చూసి మెట్రో ప్రయాణికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు ప‌రిస్థితిని స‌మీక్షించారు. క్లూస్ టీమ్ సాయంతో ఘ‌ట‌నా ప్రాంతంలో ఆధారాలను సేక‌రించారు. కాగా, హ‌త్య ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని పోలీసులు తెలిపారు. ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ద్యం మ‌త్తులో గొడ‌వ‌ప‌డిన‌ట్లు, ఆ గొడ‌వ‌లోని ఈ హ‌త్య జ‌రిగిన‌ట్లు త‌మ ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo