ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 18, 2020 , 18:48:34

ప‌టాకుల గిడ్డంగిలో మంట‌లు.. వ్య‌క్తి మృతి

ప‌టాకుల గిడ్డంగిలో మంట‌లు.. వ్య‌క్తి మృతి

జైపూర్ : ప‌టాకుల గిడ్డంగిలో మంట‌లు చెల‌రేగి ఓ వ్య‌క్తి మృతిచెందాడు. ఈ విషాద సంఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... గోదాంలో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగాయి. ఈ మంట‌ల్లో చిక్కుకుని ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. వెంట‌నే చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతిచెందాడు. ఐదు అగ్నిమాప‌క యంత్రాలు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని దాదాపు 30 నిమిషాలు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చాయి. నివాస ప్రాంతంలో అక్ర‌మంగా ప‌టాకులను నిల్వ ఉంచిన‌ట్లుగా స‌మాచారం. ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.


logo