Crime
- Jan 18, 2021 , 11:34:19
VIDEOS
కోతిని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు..

సూర్యాపేట: జిల్లాలోని విజయవాడ జాతీయ రహదారిపై కోతిని తప్పించపోయి ఓ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుచ్చిబాబు అనే వ్యక్తి తన కారులో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సూర్యాపేట మండలంలోని టేకుమట్ల బస్టాండ్ వద్ద కారుకు అడ్డంగా కోతి వచ్చింది. దీంతో దానిని తప్పించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. అయితే కారులో ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన బుచ్చిబాబును దవాఖానకు తరలించారు. రోడ్డుపై అడ్డంగా పడిఉన్న కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
తాజావార్తలు
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్‌తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ
- సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
- దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మందికిపైగా కరోనా టీకా
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఉత్పత్తి కేంద్రం నుంచి భారీగా మొసళ్లు మాయం
MOST READ
TRENDING