గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 07:34:11

బైకును కారుతో ఢీకొట్టి.. బానట్‌పై పడినా ఆపకుండా ఈడ్చుకెళ్లి..

బైకును కారుతో ఢీకొట్టి.. బానట్‌పై పడినా ఆపకుండా ఈడ్చుకెళ్లి..

న్యూఢిల్లీ : ఇద్దరు వాహనదారుల మధ్య వివాదం వ్యక్తి ప్రాణాలు మీదికి తెచ్చింది. ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (వెస్ట్) దీపక్ పురోహిత్ తెలిపిన వివరాలు.. ఢిల్లీ ఉత్తర ప్రాంతం పంఖా రోడ్డులో నివసిస్తున్న చేతన్‌ గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా నజాఫ్‌గఢ్‌ రోడ్డులో కారు ఢీకొట్టింది. దీంతో అతడు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి బయటకు రమ్మని కారు ముందు నిలబడ్డాడు. అడ్డు తప్పుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో డ్రైవర్‌ కారుతో చేతన్‌ను ఢీకొట్టడంతో బానట్‌పై పడి వైపర్‌లను పట్టుకున్నాడు. వాహనాన్ని వేగంగా నడపడంతో పట్టుకోల్పోయి కిందపడ్డా ఆపకుండా 150 మీటర్ల దూరం లాకెళ్లాడు. స్థానికులు కారును ఆపడంతో అందులోని ఇద్దరు పారిపోయారు. గాయపడిన చేతన్‌ను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ 279 (రాష్ డ్రైవింగ్), 307 (హత్యాయత్నం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితులు కారు డీలర్లని  ఉత్తమ్ నగర్‌లోనే నివాసం ఉంటారని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo